పాటలుఒక్క సంగీతమేదో పాడునట్లు     

రచన : కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాఖ్యానం : తనికెళ్ళ భరణి


పద్యం
ఒక్క సంగీతమేదో పాడునట్లు
భాషించునపుడు వినిపించుభాష
విస్పష్టముగనెల్ల వినిపించునట్లు
స్పష్టోచ్ఛారణమ్మున నొనరు భాష
రస భావముల సమర్పణ శక్తియందున
అమరభాషకు ధీటైన భాష
జీవులలోనున్న చావయంతయు
చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష
భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి
భాషయన యిద్దియని చెప్పబడిన భాష
తనరు ఛందస్సులోని అందమ్ము, నడక, కీర్తి
చూపించి నట్టిది తెలుగు భాష

 


ము౦దు పాట                              పాటల పేజి                              తరువాతి పాట