పాటలుపాడనా తెలుగుపాట    

రచన : సంస్కృతి శ్రీకాంత్

వ్యాఖ్యానం : తనికెళ్ళ భరణి


పల్లవి :పాడనా తెలుగుపాట తేనెలే చిలుకుమాట
పువ్వులే విరియగ నవ్వులే మెరియగ
మధురపు భావంతో హృదయము కదిలేలా
గగనపు నెలవంక నేలకు చేరేలా
తెలుగూ, సంధ్య వెలుగూ, అమ్మ పిలుపూ, చెలియవలపూ
మేలుకొలుపూ, ప్రేమ గెలుపూ పదము పదము
సుధలో తడిపి సుందరంగా సుస
నవ్యగీతం, భవ్యగీతం, దివ్యగీతం, శాంతిగీతం
కాంతిగీతం... సంగీతమూ కలిపి    || పాడనా ||

1. నల్లని కోయిల తియ్యని రాగాల - భావాలన్నీ తెలుగు
తెల్లని మల్లెలు విరిసిన వేళ - ఘుమ ఘుమలన్నీ తెలుగూ
అమ్మ పిలుపూ - నాన్నపలుకు
తియ్యని ప్రతిమాట తెలుగు
మనసు తెలుగు మన మమత తెలుగు
మన బ్రతుకు తెలుగు మన భవిత తెలుగు
మన ఊరు తెలుగు మనవాడ తెలుగు
మన పంట తెలుగు మన వంట తెలుగు
తెలుగే మరచిన తెలుగోడు కానేకాదు    || పాడనా ||

2. పచ్చని చిలకలు కిలకిల పలికే    
కులుకులు అన్నీ తెలుగు
వెచ్చని ఊపిరి శ్వాసని శ్వాసల
గుండెల దరువూ తెలుగూ
నీవు తెలుగు నేను తెలుగు
కమ్మని ప్రతిమాట తెలుగు
భాష తెలుగు మన యాస తెలుగు
మన ఆశ తెలుగు మన శ్వాస తెలుగు
మన నీతి తెలుగు మన జాతి తెలుగు
మన పేరు తెలుగు మన ఊరు తెలుగు
తెలుగే మరచిన తెలుగోడు కానే కాదు.    || పాడనా ||

 


                              పాటల పేజి                              తరువాతి పాట