పాటలుకమ్మనైన తెలుగు భాష    

రచన : ఎలమర్తి రమణయ్య

వ్యాఖ్యానం : తనికెళ్ళ భరణి


పల్లవి:    కమ్మనైన తెలుగు భాష కలనైనా మానొద్దు
అమ్మపాల తీపిదనం మాతృభాష మరవొద్దు
తెలుగుదనం మనకు ధనం తెలుగు భాష తియ్యదనం
మనసులు కలబోసి మనకు మమత లొసగు సాధనం

1. కవులెందరో వెలయించిన సాహిత్య పూదోట
అన్నమయ్య త్యాగయ్యలు సుధలొలికిన తెలుగుపాట
ఆంధ్రత్వం ఆంధ్రభాష ఎన్నో నోముల ఫలము
అది మరచిన ఆంధ్రులగతి అంధకార బంధురం

2. ఆంగ్ల భాష వ్యామోహం ఆంధ్రానికి ఒక శాపం
కాకూడదు కాకూడదు తెలుగు తల్లికది శోకం
మాతృభాష ప్రేమించు పరభాషల గౌరవించు
తెలుగు బువ్వ తిన్నందుకు తెలుగోడిగ జీవించు

3. మమ్మీ డాడీలు వద్దు అమ్మ నాన్నలే ముద్దు
అచ్చమైన తెలుగువీడి ఆంగ్లబాట నడవద్దు
అవసరమున్నంత వరకు ఆంగ్లాన్నే నేర్వండీ
అనవసరపు ఆర్భాటం ఆత్మవంచనేనండీ


ము౦దు పాట                              పాటల పేజి                              తరువాతి పాట