పాటలుతల్లి పాల    

రచన : లక్ష్మీకాంత్

వ్యాఖ్యానం : తనికెళ్ళ భరణి


తల్లి పాల గలసి తనువు జేరు తెలుగు
జాగృతంబు జేయు జాతి వెలుగు
తేజ మొసగునట్టి తేట తేనే చినుకు
పరవశింప జేయు పసిడి పలుకు తెలుగు
పల్లవి : తల్లి పాల భాష ఇది తెలుగు జాతి శ్వాస
సుందరమౌ సుమధురమౌ
ప్రణవ నాద ఘోష మన అచ్చ తెలుగు భాష

1.   నన్నయ భారత కవనమున - ప్రాభవ మొందిన ఇతిహాస
రాయల భువన విజయమున - ధీటుగ మెరసిన మణిపూస
అన్నమయ్య... సంకీర్తనగా
భారతీయ సంస్కృతినే చాటగ
సకల జనుల హృది వీణను మీటగ
సగరి సని సగప పనిదపమ పని స
నిదప నిదమ  గమ నిప గమరి రిస
భిన్నత్వంలో ఐక్యత పెంచే
భావితరాలకు సాహితి పంచే
మంజుల మంజూష .. వాగ్దేవి దరహాస

2.   గానం నాట్యం ఆత్మీయం
తొణికిస లాడే పీయూష
ఆధునికాంధ్ర కవిత్వంలో
గగనము కెగసిన వాగ్భాష
సకల మతములతో విలసిల్లునదై
అవధానానికి అర్హత కలదై
పద భాషలపై కూరిమికలదై
విశ్వ చరితలో విశిష్ట భాషై
భారతమాతకు కంఠహారమై
ఒదిగి వాగ్భూష తెలుగు తల్లి హృదిభాష


ము౦దు పాట                              పాటల పేజి                              తరువాతి పాట