పాటలుకడలి అంచులు దాటి    

రచన : సి.నారాయణ రెడ్డి

వ్యాఖ్యానం : తనికెళ్ళ భరణి


కడలి అంచులు దాటి కదిలింది తెలుగు
ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు
ఇటు మలేషియ నుంచి అటు అమెరికా వరకు
పలుదిశల గళమెత్తి పలికింది తెలుగు
ఎక్కడున్న ఎన్ని చిక్కులున్న సరే
తలఎత్తి నిలుపుమని తెలిపింది తెలుగు   II కడలి అంచులు దాటి II

ఏ భాష చిలుకైన ఏ యాస చినుకైన
తనలోన కలుపుకుని తరలింది తెలుగు
ఒదిగొదిపోతున్న ఒరవళ్ళతో సాగి
హమ్మంటు వేమనగ ఉరిమింది తెలుగు   II కడలి అంచులు దాటి II

అభినయానికి హృదయ మర్పించుకొని
కూచిపూడియే నాడిగా ఆడింది తెలుగు
సంగీతమే జీవసంపుటిగ త్యాగయ్య
ప్రతిపదములో కరిగి పాడింది తెలుగు   II కడలి అంచులు దాటి II

స్వాతంత్ర్య సమరాన స్వచ్ఛందగతులీన
ఉగ్రనేత్రం తెరిచి ఉరికింది తెలుగు
శాంతికి కపోతమైన క్రాంతి జలపాతమై
నిత్యవర్థిష్ణువై నిలిచింది తెలుగు   II కడలి అంచులు దాటి IIము౦దు పాట                              పాటల పేజి